Friday, June 28, 2024

2024 Profile

 చేసిన కార్యక్రమాలు:-

1)     రాజకీయ రంగంలో చేసిన కార్యక్రమాలు  

2)    సేవా రంగం లో చేసిన కార్యక్రమాలు

రాజకీయ రంగంలో చేసిన కార్యక్రమాలు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కి విధేయులుగా ఉన్న కుటుంబంలో జన్మించడం జరిగింది. మా తండ్రి కర్నాటి మాలకొండయ్య నందమూరి తారక రామారావు గారి సినీ అభిమాని గా ఉంటూ నందమూరి తారక రామారావు గారు 1983 లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి పార్టీ కార్యకర్త గా కొనసాగారు.మా నాయనమ్మ కర్నాటి భూమక్క నందమూరి తారక రామారావు గారిని పెద్ద కొడుకు గా పిలుస్తూ అందరికీ చెప్పుకుని మురిసిపోయేది.అలాంటి కుటుంబం లో జన్మించడం వలన చిన్నతనం నుండే తెలుగుదేశం పార్టీ మీద అభిమానం,పసుపు జెండా అంటే ఒకరకమైన పిచ్చి ఉండేది.అందువల్ల చిన్నతనం నుంచే తెలుగుదేశం పార్టీ చేస్తున్న అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం జరిగింది.  

2003-2007 వరకు జంగారెడ్డిగూడెం నోవా కాలేజ్ లో ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్(TNSF) పట్టణ అధ్యక్షుడి గా పని చేయడం జరిగింది.2004 లో ఉదయగిరి ఎమ్మెల్యే గా పోటీ  చేసిన కంభం విజయరామిరెడ్డి గారి కోసం విధ్యార్ధి నాయకుడి గా ప్రచారం చేయడం జరిగింది.ఈ సమయం లో అనేక సార్లు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది.

                                  1  

2007 లో చదువు అవ్వగానే ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ విప్రో లో జాబ్ సాదించిన నేను తరువాత కాలం లో  తెలుగుదేశం పార్టీ మీద అభిమానం తో మరియు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గా చూడాలనే కోరికతో 2008 లో ఉద్యోగానికి రాజీనామా చేసి పాలెం శ్రీకాంత్ రెడ్డి గారి అధ్యక్షతన ప్రారంభం అయిన తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం లో వ్యవస్థాపక సభ్యుని గా చేరడం జరిగింది. తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం ఉపాధ్యక్షులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి మరియు పుట్టా కిషోర్ లతో కలిసి పనిచేయడం జరిగింది.

2

2008 నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం,నందమూరి తారక రామారావు గారి జయంతి,వర్ధంతి తో పాటు నారా చంద్రబాబు నాయుడు,నారా లోకేష్ మరియు నందమూరి బాలకృష్ణ ల జన్మదినోత్సవాల సంధర్భం గా పేదలకు అన్నదానం,హాస్పిటల్ లో రోగులకు పాలు,పండ్లు,దుప్పట్లు పంచడం జరిగింది.   

                                                            3,4

2009 లో ఉదయగిరి నియోజకవర్గ తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం అధ్యక్షుని గా నియమించారు.ఉదయగిరి నియోజకవర్గ అధ్యక్షుని గా అనేక కార్యక్రమాలు నిర్వహించడం తో పాటు అనేక మంది యువకులని తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం లో చేర్చడం జరిగినది.తెలుగుదేశం పార్టీ కి మరియు “తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం” అభివృద్ది కి చేసిన కృషి ఫలితం గా “నెల్లూరు జిల్లా కార్యదర్శి” గా నియమించారు.

                                                              5

2009 లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో “తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం” తరపున హయాత్ నగర్ డివిజన్ బాధ్యతలు అప్పగించింది.ఆ ఎన్నికలలో అక్కడి తెలుగుదేశం పార్టీ నాయకులని మరియు కార్యకర్తలని సమన్వయం చేసుకోవడం జరిగింది.ఆ ఎన్నికలలో హయాత్ నగర్ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి విజయం సాధించటం జరిగింది.గెలుపు కి కృషి చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పాలెం శ్రీకాంత్ రెడ్డి గారి ప్రశంశలు అందుకోవడం జరిగింది.   

                                                                        6

2009 లో జరిగిన ఎన్నికల ప్రచారం లో భాగం గా ఉదయగిరి నియోజక వర్గం తో పాటు నెల్లూరు జిల్లా మొత్తం తిరిగి తెలుగుదేశం పార్టీ సిద్దాంతాలను మరియు నారా చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత ని వివరించడం జరిగింది.ఈ ఎన్నికలలో ఉదయగిరి నుంచి తెలుగుదేశంపార్టీ అభ్యర్ది గా పోటీ చేసిన కంభం విజయరామిరెడ్డి గారి కోసం పనిచేయడం జరిగింది.  

2011 లో  “తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం” ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గా నియమించడం జరిగింది.2011 లో “బ్రింగ్ బాబు బ్యాక్” క్యాంపైన్ ని సోషల్ మీడియా వేదిక గా ప్రారంభించడం జరిగింది.

                                                                        7

2011 లో నారా చంద్రబాబు నాయుడు గారి మరియు తెలుగుదేశం పార్టీ సిద్దాంతాలను గ్రామ గ్రామానికి తెలిసేలా చేయడానికి www.cbnlivenews.com(cbn=చంద్రబాబునాయుడు) అనే రాజకీయ అంశాలను చర్చించే విధం గా డిస్కషన్ బోర్డు ని ఏర్పాటు చేయడం జరిగింది.ఇందులో 294 నియోజక వర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు చర్చించే విధం గా మరియు సమస్యలను పోస్ట్ చేసే విధం గా ఏర్పాటు చేయబడింది.

2011 నుంచి ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ గురించి తెలిసేలాగా ఒక లక్ష క్యాలెండర్ల ని అన్ని నియోజకవర్గాలకు చేరేలా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నాను.ఈ క్యాలెండర్లని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు,నందమూరి బాలకృష్ణ గారు మరియు నారా లోకేష్ గారి చేతుల మీదు గా ఆవిష్కరించడం జరుగుతుంది.

                                                            8,9,10

2012 లో “తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం” “ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి” గా నియమించడం జరిగింది. 2012  లో నారా చంద్రబాబు నాయుడు గారు “తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం” సభ్యుల ప్రమాణ స్వీకారానికి విచ్చేసి సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేసారు.

                                                            11

2012 లో 200 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులను నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షం లో “తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం” లో చేర్చడం జరిగింది.వారు అందరూ కూడా రాష్ట్రo  లో అన్ని నియోజకవర్గాలకి చెందిన వారు కావడం గమనార్హం.

                                                            12

2012 లో “మనకోసం – తెలుగుదేశం” అనే కార్యక్రమాన్ని ప్రారంభించి 15 నియోజకవర్గాలలో విజయవంతం గా  నిర్వహించడం జరిగింది.

2012 లో జరిగిన ఉప ఎన్నికలలో భాగం గా నందమూరి బాలకృష్ణ గారి తో కలిసి ప్రచారం లో పాల్గొనడం జరిగింది.అదే ఎన్నికలలో ఉదయగిరి నియోజకవర్గం లో మొదటిసారి పోటీ చేసిన బొల్లినేని రామారావు గారి గెలుపు కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ప్రచారం లో భాగం గా ఉదయగిరి నియోజకవర్గానికి విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఉదయగిరి నియోజకవర్గం లోని సమస్యలను వివరించడం జరిగింది.

                                                                        13

2012 ఉదయగిరి నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం 2009 లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ది గా పోటీ చేసిన సుంకర అంజనాద్రి మరియు వారి సోదరుడు సుంకర వెంకటాద్రి గారిని తెలుగుదేశం పార్టీ లో చేరే విధం గా చర్చలు జరిపి వారిని నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీ లో చేర్చడం జరిగింది.

                                                                        14   

2013 లో నారా చంధ్ర బాబు నాయుడు గారు ప్రారంభించిన “వస్తున్నా మీ కోసం” పాదయాత్ర లో పాల్గొనడం తో పాటు ఆ పాదయాత్ర కి సంబంధించిన ఫోటో లు మరియు వీడియొలను నా యొక్క వెబ్ సైటు www.cbnlivenews.com లో పోస్ట్ చేయడం తో పాటు ఆ పోస్ట్ లను మిగిలిన సోషల్ మీడియా లో షేర్ చేయడం జరిగింది.

2013 లో www.cbnlivenews.com ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రతి శనివారం కలిసే అదృష్టo  కలిగింది. ఆయన తో గడిపిన క్షణాలు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం జీవితం మరచిపోలేని జ్ఞాపకాలు.

                                                                        15  

2013 లో “కొత్త ఓటర్ల నమోదు” కార్యక్రమాన్ని విజయవాడ,హైదరాబాద్ మరియు ఉదయగిరి లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అప్పటి శేరిలింగం పల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి మువ్వా సత్యనారాయణ,సీనియర్ నాయకులు బండి రమేష్ లు విచ్చేయడం జరిగింది.

                                                                        16  

2014 “జాబు కావాలంటే - బాబు రావాలి” అంటూ తెలుగుదేశం పార్టీ కి మద్దత్తు గా “యువ సంకల్ప యాత్ర” ని హైదరాబాద్ కూకటపల్లి జేయన్టీయూ యూనివర్సిటీ దగ్గర ఉన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం దగ్గర నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు బైక్ ర్యాలీ మరియు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమ పోస్టర్లను నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదు గా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం ముగింపు కి నారా లోకేష్ గారు విచ్చేశారు.

                                                                        17

2014 లో జరిగిన “సమైఖ్య ఆంధ్ర” కోసం జరిగిన అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం జరిగింది. అలాగే హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్  పైన ఉన్న తెలుగు వారి విగ్రహాలను పడకొట్టినందుకు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

                                                                        18

2014 లో నారా చంద్రబాబు నాయుడు గారి “గెలుపు చారిత్రాత్మక అవసరం” అంటూ అనేక పాదయాత్ర కార్యక్రమాలు మరియు “బ్రింగ్ బాబు బ్యాక్” అంటూ అనేక ర్యాలీ లు నిర్వహించడం జరిగింది.

                                                            19  

2014 లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నారా లోకేష్ గారు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం లో పాల్గొని నా యొక్క ఆలోచనలను నారా లోకేష్ గారి తో పంచుకోవడం జరిగింది.

                                                            20   

2014 లో నారా లోకేష్ గారిని తరచుగా కలిసి తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం తరుపున బ్రింగ్ బాబు బ్యాక్ కార్యక్రమాలను వివరించడం జరిగింది.

                                                            21

2014 లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నారా రోహిత్ గారు గుంటూరు నుంచి వైజాగ్ వరకు చేసిన ప్రచారం లో పాల్గొనడం జరిగింది. అంతే కాక ఉదయగిరి,ఉండి,కొవ్వూరు,జూబ్లీ హీల్స్ నియోజక వర్గాలలో తెలుగుదేశం పార్టీ ప్రచారం లో పాల్గొనడం జరిగింది.

                                                            22

2014 లో ఉదయగిరి నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం బొల్లినేని వెంకట రామరావు గారితో కలిసి మరియు వారి తనయులు బొల్లినేని కార్తీక్ మరియు బొల్లినేని ధనుష్ లతో కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది.

                                                            23  

2014 లో ఉదయగిరి నియోజకవర్గ ఓటర్లు అధికం గా ఉండే హైదరాబాద్,విజయవాడ,గుంటూరు మరియు బెంగుళూరు లలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాల్లో ముఖ్య అతిధి గా బొల్లినేని రామారావు గారిని పిలిచి అక్కడి ఓటర్ల తో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆయన గెలుపు లో ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. 

                                                            24

2014 లో మల్కాజ్ గిరి పార్లమెంటు నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్ధి గా పోటీ చేసిన మల్లారెడ్డి గారి గెలుపు కోసం కృషి చేయడం జరిగింది.

2014 లో తెలుగు దేశం పార్టీ గెలుపు కి కృషి చేసినందుకు  తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం మరియు బ్రింగ్ బాబు బ్యాక్ వాలెంటీర్లను నారా లోకేష్ గారు జే.ఆర్.సీ కన్వెన్షన్ హాల్,ఫిల్మ్ నగర్ లో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి ఘనం గా సత్కరించారు.                                                  

2014 లో ఘన విజయం సాదించిన నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.                    

                                                            25

2015 తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కళా వెంకట రావు గారిని కలిసి నేను చేస్తున్న కార్యక్రమాలను వివరించడం జరిగింది.తెలుగుదేశం పార్టీ ఆఫీసు సమన్వయ కర్త మరియు టీటీడీ డైరెక్టర్ గా ఎన్నికైన రమణ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.

                                                            26

2015 తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాదించడం లో కీలక పాత్ర వహించిన టీడీ జనార్ధన్ గారిని సన్మానించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేసిన మాకు అన్ని వేళలా అండ  గా ఉంటాను అని ఆయన మాట ఇచ్చారు.

2015 మేము ప్రచారం చేసి గెలిపించిన మాగంటి గోపీనాధ్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.ఆయన గెలుపుకోసం పనిచేసినందుకు ప్రత్యేక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియచేసారు.

                                                            27  

2016 గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో భాగం గా కె.పి.హెచ్.బి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి గా పోటీ చేసిన మందడి శ్రీనివాసరావు గారి గెలుపు కోసం కృషి చేయడం జరిగింది.ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గా ఆయన ఒక్కరే విజయం సాదించటంతో ఆయనని ఒక్కమగాడు గా పిలిచేవారు.  

2016 కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచిన నారా లోకేష్ గారిని సన్మానించి కార్యకర్తల సంక్షేమం గురించి చర్చించడం జరిగింది.

                                                            2 

2017 వింజమూరు దహార్తిని తీర్చేందుకు జలాధార పేరుతో వందల కోట్ల అభివృద్ది పనుల శంకుస్థాపన కి విచ్చేసిన మంత్రివర్యులు సోమిరెడ్డి గారిని,బీద రవి చంద్ర గారిని మరియు మా ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గారిని సన్మానించడం జరిగింది.                       

                                                            29

2018 నందమూరి కుటుంబం నుంచి కూకట్పల్లి నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి గా పోటీ చేసిన “నందమూరి సుహాసిని” గారి మొదటి రోజు నామినేషన్ నుంచి ఎన్నికలు పూర్తి అయ్యేవరకు కూడా ప్రతి రోజు ఆమె తో పాటు ఎన్నికల ప్రచారం లో పాల్గొనడం జరిగింది.

                                                            30,31  

2018 కూకట్పల్లి నియోజకవర్గం లో అనేక బైక్ ర్యాలీలు,ఇంటి ఇంటికి తిరిగి ప్రచారం చేయడం తో పాటు ప్రముఖ నాయకులు నందమూరి బాలకృష్ణ,రామ్మోహన్ నాయుడు,నందమూరి తారక రత్న,పొత్తు లో భాగం గా ప్రచారానికి విచ్చేసిన సిపిఐ నారాయణ,కాంగ్రెస్ సేనియర్ నాయకులు వి.హనుమంత రావు గారు తదితరులతో కలిసి ఎన్నికల ప్రచారం లో పాల్గొనడం జరిగింది.  

                                                            32,33,34    

2019 నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి నేను ప్రత్యేకం గా తయారు చేయించిన నందమూరి తారక రామారావు గారి రేడియం విగ్రహాలను అందించడం జరిగింది.ఆ ప్రతిమని చూసి అధ్బుతం గా ఉంది అని ప్రశంసించారు.అదే సమయం లో నారా లోకేష్ గారిని కలిసి రేడియం విగ్రహాలను అందించడం జరిగింది.ఈ విగ్రహాలను అనేకమంది ప్రముఖులకు అందించడం జరిగింది.

35     

2019  “ఆంద్రప్రదేశ్ తెలుగుయువత కమిటీ” లో పని చేసే అవకాశం కల్పించాలి అని అప్పటివరకు పార్టీ కోసం నేను చేసిన కార్యక్రమాలని తెలియచేసే విధం గా రూపొందించిన పార్టీ ప్రొఫైల్ ని నారా చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరిగింది.

                                                            36

2019 ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గం లో కూడా చేయని విధం గా ఉదయగిరి నియోజకవర్గం లో 8 మండలాల్లో ప్రతి గడప కి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ది తెలిసేలా “చైతన్య యాత్ర” పేరుతో పాదయాత్ర పాంప్లేట్స్,స్టిక్కర్స్ ని ఆవిష్కరించిన బొల్లినేని రామారావు.

                                                            37  

2019 ఉదయగిరి నియోజకవర్గం లో 8 మండలాల్లో ప్రతి గడప కి “చైతన్య యాత్ర” పేరుతో పాదయాత్ర కి అనూహ్య స్పందన లభించింది.వరికుంటపాడు మండలం నుంచి ప్రారంభం అయిన ఈ పాదయాత్ర ఉదయగిరి,సీతారామా పురం,దుత్తలూరు,వింజమూరు,కొండాపురం,కలిగిరి మీదు గా జలదంకి వరకు కొనసాగింది.   

                                                         38,39,40,41

2019 బొల్లినేని రామారావు గారికి టికెట్ విషయం లో ఏర్పడిన గందరగోళం మధ్య 2014 లో బొల్లినేని చేసిన అభివృద్ది చూసి ఆయన కి టికెట్ ఇచ్చే వరకు ఉండవల్లి నివాసం లో నారా చంద్రబాబు నాయుడు గారి తో చర్చలు జరిపి బొల్లినేని రామారావు గారికి టికెట్ వచ్చేవరకు పోరాడడం జరిగింది..

                                                                 42  

2019 ఎన్నికల ప్రచారం లో భాగంగా “బొల్లినేని రామారావు” గారి గెలుపు కోసం ఉదయగిరి నియోజకవర్గానికి విచ్చేసిన “నారా చంద్రబాబు నాయుడు” గారిని గజమాలతో సత్కరించడం జరిగింది.బొల్లినేని రామారావు గారి గెలుపు కోసం ప్రచారానికి విచ్చేసిన మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని మరియు బొల్లినేని రామారావు గారిని పూలమాలతో సత్కరించడం జరిగింది.

43  

2019 లో ఉదయగిరి నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం బొల్లినేని వెంకట రామారావు గారితో కలిసి మరియు వారి తనయులు బొల్లినేని కార్తీక్ మరియు బొల్లినేని ధనుష్ లతో కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది.                                        

44,45  

2019 లో ఉదయగిరి నియోజకవర్గ ఓటర్లు అధికం గా ఉండే హైదరాబాద్,విజయవాడ,గుంటూరు మరియు బెంగుళూరు లలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాల్లో ముఖ్య అతిధి గా బొల్లినేని రామారావు గారిని పిలిచి అక్కడి ఓటర్ల తో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

                                                             46

2019 తెలుగుయువత మరియు సిబియన్ ఆర్మీ ఆధ్వర్యం లో ఉదయగిరి నియోజకవర్గం లో బొల్లినేని రామారావు గెలుపు కోసం ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేసి అనంతరం నియోజకవర్గ ప్రధాన కూడళ్లలో పాదయాత్ర గా ర్యాలీ లు నిర్వహించాము.

                                                              47

2019 తెలుగుదేశంపార్టీ ఓటమి అనంతరం కార్యకర్తలకు ఆత్మ విశ్వాసం నింపే క్రమం లో ఓడిపోయిన వెంటనే ఒక మీటింగ్ పెట్టి 2024 లో గెలుపు కోసం ప్రయత్నం ప్రారంభించేలా ప్రణాళికా రూపొందించడం జరిగింది.2020 లో జరిగిన mptc ఎన్నికల్లో జడదేవి నుంచి mptc అభ్యర్ధి గా నామినేషన్ వేయడం జరిగింది. గెలుపు ఊపులో ఉన్న వైసీపీ ఏకగ్రీవానికి ప్రయత్నం చేసి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నప్పటికీ వారి ప్రయత్నాలను తిప్పికొట్టి నామినేషన్ వేయడం జరిగింది. ఆ గొడవ అన్నీ ప్రముఖ ఛానెల్స్ లో సైతం ప్రసారం అయ్యింది.

                                                              48  

2019 లో తెలుగుదేశం పార్టీ ఓటమి అనంతరం నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నెల్లూరు లో నియోజకవర్గాల వారి గా నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో పాల్గొని ఓటమి కి గల కారణాలని తెలియచేయడం జరిగింది.

                                                              49

2019 లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ముఖ్య నాయకులతో నిర్వహించిన స్టేట్ బాడీ మీటింగ్ లో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తో కలిసి పాల్గొని నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది.

                                                              50  

2020 “తెలుగు యువత” కోసం ప్రత్యేకం గా నిర్వహించిన శిక్షణ కార్యక్రమం లో నారా లోకేష్ గారిని కలిసి నా అభిప్రాయాలను పంచుకోవడం జరిగింది.

                                                              51

2020 మా నాన్న గారితో కలిసి “నారా చంద్రబాబు నాయుడు” గారిని కలవగా మానాన్న గారి ఆరోగ్యం గురించి వాకబు చేయడం మరచిపోలేని అనుభూతి.

                                                                                    52

2020 నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి 2020 నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరింప చేసి  సత్కరించడం జరిగింది. 

                                                              53

2020 ఉదయగిరి మాజీ శాసన సభ్యులు బొల్లినేని రామారావు తనయుడు బొల్లినేని ధనుష్ పెళ్ళికి విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు మరియు నందమూరి బాలకృష్ణ గారితో సమయం గడపడం జరిగింది.

                                                              54

 

2020 గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో భాగం గా కూకట్పల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి గా పోటీ చేసిన ఉప్పల పద్మ చౌదరి కి మద్దత్తు గా ఎన్నికల ప్రచారం లో “నందమూరి సుహాసిని” గారితో,తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్. రమణ మరియు మరికొంత మంది ప్రముఖులతో కలిసి పాల్గొనడం జరిగింది.   

                                                              55

2021 లో కరోన మహమ్మారి చేసిన విధ్వంసం లో కరోనా సమయం లో నేను చేసిన సహాయ కార్యక్రమాలకు మెచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకం గా శుభాకాంక్షలు తెలియచేసారు.

2021 లో కరోన మహమ్మారి చేసిన విధ్వంసం లో కరోనా సమయం లో నేను చేసిన సహాయ కార్యక్రమాలకు మెచ్చి నారా లోకేష్ గారు ప్రత్యేకం గా శుభాకాంక్షలు తెలియచేసారు.

                                                              56  

2021 లో నారా లోకేష్ గారిని ఆయన నివాసం లో కలిసి తెలుగు యువత ఆధ్వర్యం లో చేస్తున్న కార్యక్రమాలను మరియు నేను చేయబోయే చైతన్య యాత్ర గురించి తెలియచేయడం జరిగింది.

                                                              57    

2021 “ఆంధ్రప్రదేశ్ తెలుగుయువత కమిటీ” లో పనిచేసే అవకాశం కల్పించాలి అని అప్పటివరకు పార్టీ కోసం నేను చేసిన కార్యక్రమాల ని తెలియచేసే పార్టీ ప్రొఫైల్ ని “నారా లోకేష్” గారికి అందించడం జరిగింది.

                                                              58    

2022 “నారా లోకేష్” గారిని ఆయన నివాసం లో కలిసి భద్రాచలం రాముల వారి ప్రసాదం అందించి “తెలుగు యువత” ఆధ్వర్యం లో నేను చేస్తున్న కార్యక్రమాలని వివరించడం ఆయన కొన్ని సలహాలు సూచనలు చేయడం జరిగింది.                                                  59 

2022 లో నా పుట్టిన రోజు సంధర్భం గా నా కుమారుడి తో కలిసి “నారా లోకేష్” గారి సమక్షం లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం మరచిపోలేని అంశం.

                                                              60  

2023 లో “తెలుగు యువత ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడి” గా అవకాశం కల్పించారు. ఆ తరువాత జరిగిన రివ్యూ మీటింగ్ లో తెలుగు యువత ఆధ్వర్యం లో చేస్తున్న కార్యక్రమాలను నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి తెలుగు యువత అధ్యక్షులు శ్రీరాం చినబాబు గారితో కలిసి వివరించడం జరిగింది.

                                                   61  

2023 లో తెలుగుయువత ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యక్షుడి గా ఎన్నికైన అనంతరం నా పుట్టిన రోజు ని నారా లోకేష్ గారు నిర్వహించడం జరిగింది.తెలుగు యువత తరుపున చేస్తున్న కార్యక్రమలని అభినందించడం తో పాటు భవిష్యత్తు లో చేయాల్సిన కార్యక్రమలకి దిశా నిర్ధేశం చేశారు.  

                                                   62  

2023 లో నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఉదయగిరి నియోజక వర్గ సమస్యలను వివరించడం జరిగింది. దానితో పాటు 2024 ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడం జరిగింది.

                                                   63   

2023 యువత లో చైతన్యం నింపడం కోసం నారా లోకేష్ గారు చేసిన “యువగళం” పాదయాత్ర లో చురుకుగా పాల్గొనడం జరిగింది.

                                                   64  

2023 నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ని నిరసిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.మెట్రో రైల్ లో నల్ల దుస్తులు దరించి ప్రయాణం చేయడం,అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాల వద్ద నిరసన కార్యక్రయమలు నిర్వహించడం,కొవ్వొత్తుల ర్యాలీలు మరియు పాదయాత్రలని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు నందమూరి చైతన్య కృష్ణ గారు ముఖ్య అతిది గా విచ్చేశారు.

2023 సైకో పోవాలి సైకిల్ రావాలి అన్న నినాదంతో ఆంధ్రప్రదేశ్ మరియు హైదరాబాద్  లోని అన్ని ప్రాంతాలలో ర్యాలీలు సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది.

                                                   65  

2023 నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ నుంచి నిర్ధోషి గా విడుదల అయిన సంధర్భం గా నెల్లూరు జిల్లా పెంచలకోన నరసింహ స్వామి దగ్గర పూజ కి విచ్చేసిన “నారా చంద్రబాబు నాయుడు” గారికి “సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి” గారితో కలిసి ఘన స్వాగతం పలకడం జరిగింది.   

                                                   66  

2024 లో ఉదయగిరి నియోజక వర్గం తో పాటు నెల్లూరు అన్ని నియోజక వర్గాలలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ముఖ్యం గా ఉదయగిరి లో కాకర్ల సురేష్ గెలుపు కోసం సీట్ ని ప్రకటించిన మొదటి రోజు నుంచి కాకర్ల సురేష్ తో కలిసి ప్రచారం మొదలు పెట్టడం జరిగింది.

                                                   67,68   

2024 ఉదయగిరి లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కాకర్ల సురేష్ తో కలిసి ఇఫ్తార్ విందులలో పాల్గొనడం,అనేక మీటింగ్ లలో మరియు ప్రెస్ మీట్ లలో పాల్గొనడం జరిగింది.

                                                    69

2024 ఉదయగిరి లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కాకర్ల సురేష్ గెలుపు కోసం ప్రచారానికి విచ్చేసిన ప్రముఖ హీరో నారా రోహిత్ తో కలిసి ప్రచారం లో భాగస్వామ్యం తీసుకోవడం జరిగింది.

                                                   70

2024 ఉదయగిరి లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కాకర్ల సురేష్ గెలుపు కోసం ప్రచారానికి విచ్చేసిన అనేకమంది ప్రముఖులతో కలిసి ప్రచారం లో పాల్గొనడం జరిగింది.

                                                   71

 2024 ఉదయగిరి లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కాకర్ల సురేష్ గెలుపు కోసం ప్రచారానికి అవసరమయ్యే సామగ్రి ని నా స్వంత ఖర్చులతో ప్రచారానికి వాడుకునేలా అందించడం జరిగింది.

                                                   72  

2024 ఉదయగిరి లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కాకర్ల సురేష్ గెలుపు కోసం హైదరాబాద్ లోని బి. యన్ రెడ్డి నగర్ లోనూ అలాగే మియాపూర్ లోనూ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి హైదరాబాద్ లో నివసిస్తున్న ఉదయగిరి నియోజకవర్గ ఓటర్లను ఉదయగిరి వచ్చి ఓటు వేసేలా చర్యలు తీసుకోవడం జరిగింది. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగింది.

                                                   73

2024 ఉదయగిరి లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కాకర్ల సురేష్ గెలుపు కోసం “walk for kakarla  suresh “ అనే 500 మంది యూత్ తో పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

                                                   74  

2024 లో ఉదయగిరి నియోజకవర్గం తో పాటు నెల్లూరు అన్ని నియోజక వర్గాల పోలింగ్ సరళి ని మరియు గెలుపు అవకాశాలను నారా చంద్రబాబు నాయుడు గారితో ఆయన నివాసం లో కలిసి పంచుకోవడం జరిగింది.

75   

2024 లో ఉదయగిరి నుంచి ఘన విజయం సాదించిన కాకర్ల సురేష్ ని ఘనం గా సన్మానించుకోవడం జరిగింది.

                                                   76  

2024 లో మచిలీపట్నం నుంచి ఘన విజయం సాదించి ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖా మాత్యులు గా ప్రమాణ స్వీకారం చేసిన మా అన్న కోళ్ళు రవీంద్ర గారిని,కందుకూరు నుంచి ఎమ్మెల్యే గా విజయం సాదించిన ఇంటూరి నాగేశ్వర రావు గారి ని కలిసి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.

                                                    77 

2024 లో హిందూపురం లో హ్యాట్రిక్ విజయం సాదించిన నందమూరి బాలకృష్ణ గారిని కలిసి హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఫోటో ఫ్రేమ్ ని అందించడం జరిగింది.తిరిగి ఫ్రేమ్ చేయించుకునేలా ఆయన సంతకం చేసిన ఫోటో లను మాకు అందించారు.

                                                   78  

2024 లో ఘన విజయం సాదించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు ఆంధ్రప్రదేశ్ ఐ.టీ శాఖా మాత్యులు నారా లోకేష్ గారిని ఆయన నివాసం లో కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువా కప్పి ఘనం గా సన్మానించడం జరిగింది.                     

                                                   79,80  

 

 

బాలకృష్ణ గారి అభిమాని గా చేసిన కార్యక్రమాలు

చిన్నప్పటి నుంచి నందమూరి బాలకృష్ణ గారి వీరాభిమాని గా వున్న నాకు మొదటిసారి 2008 లో కలిసే అవకాశం

వచ్చింది.2011 నూతన సంవత్సరం సంధర్భం గా నటసింహం నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యం లో క్యాలెండర్ల ని

ముద్రించి ఆయన చేతుల మీదు గా ఓపెన్ చేయించడం జరిగింది.అప్పటి నుంచి ప్రతి ఏడాది క్యాలెండర్ల ను

ముద్రిస్తున్నాము.ఊ కొడతార ఉలిక్కి పడతారా సినిమా ఓపెనింగ్ కి వెళ్ళడం జరిగింది.        

 2012 నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ అభిమానులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి అని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు యన్. బి. కె సేవా సమితి ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఆయన పుట్టిన రోజు మరియు ఆయన తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ పుట్టినరోజు ల నాడు అన్నదానం,రక్త దానం లాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది.

2013 నందమూరి బాలకృష్ణ గారిని ఆయన నివాసం లో కలిసి అభిమానులు గా మేము చేస్తున్న కార్యక్రమాలను వివరించడం జరిగింది.2014 నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను గార్లు కలిసితీసిన సింహా బ్లాక్ బస్టర్ తరువాత లెజెండ్ సినిమా షూటింగ్ సంధర్భంగా బాలకృష్ణ గారి ఆహ్వానం మీరకు వెళ్ళి ఆయనను కలవడం జరిగింది.

2015 నందమూరి బాలకృష్ణ గారి చేతులమీదుగా కీ చెయిన్స్ ని ఆవిష్కరింపచేసి అభిమానులకు పంపడం జరిగింది.2016 నందమూరి బాలకృష్ణ గారు శ్రీవాస్ డైరెక్షన్ లో నటిస్తున్న డిక్టేటర్ సినిమా షూటింగ్ కి బాలకృష్ణ గారి ఆహ్వానం మేరకు వెళ్ళి కలవడం జరిగింది.

2017 నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలలో భాగం గా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఆయన ప్రశంసలను అందుకోవడం జరిగింది.పైసా వసూల్ సినిమా విజయోత్సవ వేడుకలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన వారిని పిలిచి సత్కరించారు.

2018 నాకు కుమారుడు పుట్టిన సంధర్భం గా ఆయన ని నా కుమారుడు కి పేరు పెట్టవలసింది గా కోరగా శ్రీ మోక్షజ్ఞ పేరు పెట్టి స్వీట్ తినిపించడం జీవితం లో మరచిపోలేని అంశం. ఇదే సంవత్సరం నేను ప్రారంభించిన ఎడ్యుకేషన్ కన్సల్టన్సీ బ్రోచర్ ని ఆయన చేతుల మీదు గా విడుదల చేయడం జరిగింది.

అన్న నందమూరి తారక రామారావు గారి రేడియం విగ్రహాలను ఆవిష్కరించారు. అఖండ షూటింగ్ కి ఆహ్వానించగా వెళ్ళడం జరిగింది.నందమూరి తారక రామారావు గారి బయో పిక్ ఓపెనింగ్ కి వెళ్ళడం జరిగింది.అఖండ 175 రోజుల వేడుకకు చిలకలూరిపేట విచ్చేయగా కుటుంబం తో కలిసి వెళ్ళి కలవడం జరిగింది.ఇంకా ఎన్నో మధురస్మృతుల ని అందించిన బాలయ్య బాబు కి ఎప్పటికీ ఋణపడి ఉంటాను.

 బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మెన్ గా నందమూరి బాలకృష్ణ గారు నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీ లో పాల్గొనడం జరిగింది. ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన నందమూరి బాలకృష్ణ గారితో కలిసి ఎన్నికల ప్రచారం లో పాల్గొనడం జరిగింది.నంది అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణ గారిని అభినందించడం జరిగింది.  

 

  

 

 

 

సేవా రంగం లో చేసిన కార్యక్రమాలు

మహబూబ్ నగర్ లో వరదలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున వాలంటీర్ గా వెళ్ళి అక్కడి భాధితులకి సహాయం చేయడం జరిగింది.నేను నా స్నేహితులని 10 మంది ని తీసుకెళ్ళి సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం జరిగింది. ఇందుకు ప్రతిఫలం గా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మన్ననలు అందుకోవడం జరిగింది.

2010 లో “మనిషి కి మనిషి సహాయం అందించాలి మానవత్వాన్ని బ్రతికించాలి” అనే మా అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణ గారి పిలుపు ని అందుకుని యన్. బి . కె సేవా సమితి ని ప్రారంభించడం జరిగింది.

                                                   81  

రెండు తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అన్నీ జిల్లాలో కూడా మా సంస్థ తరపున కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.                                 

                                                   82

యన్. బి . కె సేవా సమితి ద్వారా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లు,పేద విధ్యార్ధులకు పుస్తకాలు,పెన్నులు,హాస్పిటల్స్ లో పేషంట్స్ కి పాలు,పండ్లు మరియు అన్నదాన కార్యక్రమాలు క్రమం తప్పకుండ చేస్తూ ఉన్నాము.

                                                   83

అంతేకాక కాలేజ్ లో చదివే పిల్లల కోసం వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ కేసిరాజు రామ్ ప్రసాద్ గారి చే వ్యక్తిత్వ వికాసానికి సంభంధించిన కార్యక్రమాలు నిర్వహించడమైనవి.స్కూల్ లో చదువుతున్న పేద విధ్యార్ధులకు స్కాలర్ షిప్ లతో పాటు అన్నీ చదువు తో పాటు క్విజ్,ఆటలు మొదలైన వాటి లో అత్యుత్తమ ప్రతిభ కనపరచిన విధ్యార్ధులకు ప్రోత్సాహకాలు అందించడం జరిగింది.

                                                   84  

బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో పేషంట్స్ కి ఆన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.పేషంట్స్ కి అవసరమైన దుప్పట్లు,ప్లేట్ లు ,గ్లాస్ లు మొదలైనవి క్రమం తప్పకుండా అందించడం జరిగింది.

                                                   85,86    

ఎయిడ్స్ తో తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆసరా గా నిలుస్తున్న డిజైర్ సొసైటి నందు ఆన్నదాన కార్యక్రమాలతో పాటు అక్కడి పిల్లలకు కావాల్సిన కనీస వసతులు అందెలా ఆర్ధిక సహాయం చేయడం జరిగింది.

                                                   87

పరిటాల రవీంద్ర గారి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ ఆయన జయంతి వర్ధంతి రోజున రక్త దాన శిభిరాలను ఏర్పాటు చేయడం ఆ కార్యక్రమాలకు పరిటాల సునీతగారు,పరిటాల శ్రీరామ గారు మరియు పరిటాల సిద్దార్ధ గార్లు విచ్చేశారు.

                                                   88  

మా అభిమాననటుడు,మా అన్న యువగళం పాదయాత్ర లో పాల్గొని మొదటి రోజు అస్వస్థత కి గురి అయ్యి ప్రాణాలు కోల్పోయిన నందమూరి తారక రత్న అన్న జయంతి వర్ధంతి కార్యక్రమాలకు నందమూరి అలేఖ్య గారు విచ్చేశారు.

                                                   89

యన్.బి.కె  సేవ సమితి ద్వారా చేస్తున్న సేవలకు మెచ్చి కాకతీయ సేవసమితి నిజాంపేట్ వారు వనభోజనాల సంధర్భం గా నన్ను ముఖ్య అతిది గా ఆహ్వానించి సన్మానించడం జరిగింది.

                                                   90   

యన్.బి.కె  సేవ సమితి ద్వారా చేస్తున్న సేవలకు మెచ్చి అన్న నందమూరి తారకరామారావు గారి 100 వ జయంతి సంధర్భంగా యన్. టి. ఆర్ ఫ్యాన్స్ నన్ను సత్కరించడం జరిగింది.

                                                   91   

మా తండ్రి కర్నాటి మాలకొండయ్య గారు మా ఊరి లో చదువుకునే విధ్యార్ధుల కోసం మా తాత కర్నాటి కొండయ్య జ్ఞాపకార్ధం స్కూల్ బిల్డింగ్ ని నిర్మించారు. అంతేకాక బస్ షెల్టర్ ని అలాగే ప్రయాణికులు మరియు భక్తుల సౌకర్యం కోసం కూర్చునే బళ్లాలను ఊరి లో మరియు గుడి  దగ్గర ఏర్పాటు చేశారు.   

                                                            92    



























































































No comments: